ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు

Sep 21 2025 1:05 AM | Updated on Sep 21 2025 1:45 AM

వేలిముద్ర స్థానంలో నూతన టెక్నాలజీ

తొలగనున్న లబ్ధిదారుల కష్టాలు

జిల్లాలో 1,22,559 మంది

చేయూత పింఛన్‌దారులు

ప్రతినెలా రూ.29,01,91,360 అందజేత

నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలకు అందిస్తున్న చేయూత పింఛన్లను ముఖ గుర్తింపు విధానం (ఫేస్‌ రికగ్నేషన్‌) ద్వారా పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్‌ విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. అయితే, పలువురు లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడంతో పాటు అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం నూతన టెక్నాలజీతో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. పంచాయతీ కార్యదర్శి, పోస్టుమ్యాన్‌ స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం లబ్ధిదారుల ఫొటోలను ఆధార్‌ కార్డులోని ఫొటోతో సరిచూస్తారు. యాప్‌లో రెండు ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే సరైనవి అయితేనే లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరవుతుంది. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 1,22,559 మంది లబ్ధిదారులు వివిధ చేయూత పింఛన్లు పొందుతున్నారు.

జిల్లాలో 1,22,559 మంది లబ్ధిదారులు

జిల్లాలో 1,22,559 మంది చేయూత పింఛన్‌దారులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.29,01,91,360 అందిస్తోంది. జిల్లాలో వృద్ధులు 46,358 మంది, వితంతువులు 46,376, దివ్యాంగులు 15,319, ఒంటరి మహిళలు 3,181, కల్లుగీత కార్మికులు 2,817, చేనేత కార్మికులు 2,253, డయాలసిస్‌ రోగులు 216, బోదకాలు బాధితులు 349, బీడీ కార్మికులు 5,674, బీడీ కాంట్రాక్టర్లు 16 మంది ఉన్నారు.

నూతన విధానంతో తప్పిన తిప్పలు

గతంలో వేలిముద్రలు సరిగాపడక వృద్ధులతోపాటు మరికొంతమంది పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఒకటికి నాలుగైదు సార్లు ముద్రల కోసం యత్నించినా.. ఫలితం ఉండేది కాదు. పింఛన్‌ తీసుకునేందుకు సమయం చాలా పట్టేది. ప్రస్తుతం ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. ముఖచిత్రంతో సమయం ఆదా కావడంతో పాటు ఎక్కువ మందికి పంపిణీ ఇచ్చే అవకాశం ఉంది. – గిరగాని కుమారలక్ష్మి, చేయూత పింఛన్‌దారు, నెక్కొండ

ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు1
1/2

ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు

ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు2
2/2

ఫేస్‌ రికగ్నేషన్‌తో పింఛన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement