
ట్రాన్స్‌జెండర్స్ హక్కులు తెలుసుకోవాలి
వరంగల్ లీగల్: ట్రాన్స్‌జెండర్స్ తమ హక్కులు తెలుసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ట్రాన్స్‌జెండర్లకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్లు తప్పనిసరిగా కార్డులు పొందాలని సూచించారు చెప్పారు. ఎటువంటి సమస్యలైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు పరిష్కరిస్తాయని భరోసా కల్పించారు. సదస్సులో ఎం.సాయికుమార్, బార్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వలుస సుధీర్, న్యాయవాది తీగల జీవన్‌గౌడ్, కమ్యూనిటీ అధ్యక్షురాలు లైలా, 70 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.