
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
● డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
నర్సంపేట: విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు సూచించారు. స్వీయ అవగాహన, తోటి వారిపై సానుభూతి, సమస్యల పరిష్కారానికి స్వీయ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ఫూర్తి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగాలన్నారు. శారీరక, మానసిక స్థితి, శాసీ్త్రయ దృక్ఫథం, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయకుమార్, బానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అరుణ్‌చంద్ర, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యుడు శ్రావణ్‌కుమార్, కళాశాల సీసీ నాగరాజ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.