
23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి ఈ నెల 23 (మంగళవారం)న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిసింది. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అభివృద్ధిపై సమీక్ష అనంతరం డిజైన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేస్తారని సమాచారం. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఐసీసీసీలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
వరంగల్ స్పోర్ట్స్: మలేషియాలోని యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ క్రీడా సదస్సులో హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ ప్రత్యేకత చాటుకున్నారు. చివరి రోజు శనివారం ‘కుస్తీ క్రీడలో ఠాకూర్‌దేవ్‌సింగ్ అవసరం’ అంశంపై అశోక్‌కుమార్ పేపర్ ప్రజెంటేషన్ అందించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని తండాకు చెందిన అశోక్ రెజ్లింగ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రజెంటేషన్ చేయడంపై పలువురు ప్రశంసించారు. ప్రస్తుతం అశోక్‌కుమార్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ పి.రవికుమార్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నారు
హన్మకొండ చౌరస్తా: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెను విరమించాయి. బకాయిల చెల్లింపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని శనివారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు మధ్య వారధిగా నిలిచి సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే నాయినిని సన్మానించారు.
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘రేవంతన్న సహారా మిస్కినో కే లియే’ పథకానికి అర్హులు దరఖా స్తు చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జి ల్లాల మైనార్టీల సంక్షేమాధికారులు రమేశ్, గౌస్ హైదర్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలి పారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద వితంతువులు, విడాకులు పొందిన, అ నాథ మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయంతోపాటు చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహకం అందిస్తారని పేర్కొన్నారు. రేవంతన్నా సహారా మిస్కినో కేలియే సహారా పథకం కింద మైనా ర్టీ లబ్ధిదారులకు మోపెడ్లు, ఈ–బైక్‌లు, ఒకేసారి లక్ష రూపాయల గ్రాంట్ మంజూరు చే స్తారని తెలిపారు. అర్హులు టీబీఎంఎంఎస్ న్యూ. సీజీజీ.జీఓవీ.ఇన్ ద్వారా వచ్చేనెల 6 వర కు దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు ఆయా జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి రజినీకాంత్ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది మారోజు రామకృష్ణ, ఆరోగ్యశ్రీ మేనేజర్ షమ్మి విక్రమ్, టీపీసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్‌లో 2025–26 అడ్మిషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల అిప్ల్లియేషన్స్‌పై సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. అలాగే, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వివరాలు తెలుసుకున్నారు. జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని డీఐఈఓ గోపాల్‌ను ఆదేశించారు.

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి