
ఎంగిలిపూల వేడుకకు సిద్ధం
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వరంగల్ నగరం సిద్ధమైంది. శనివారం పూల కొనుగోళ్లతో సిటీలో సందడి నెలకొంది. ట్రైసిటీలోని ప్రధాన చౌరస్తాల్లో పూల విక్రయాలు జోరుగా సాగాయి. పలు ఆలయాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాల వెలుగుల్లో వేయి స్తంభాల ఆలయం కాంతులీనుతోంది. ఇక్కడి బతుకమ్మ ప్రా రంభ వేడుకలకు అధిక సంఖ్యలో మహిళలు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ పిన్నావారి స్ట్రీట్, హనుమకొండ చౌరస్తా, కాజీపేట చౌరస్తా ఏరియాల్ల్లో రద్దీ ఏర్పడింది. ఫొటోలు: – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హనుమకొండ/వరంగల్

ఎంగిలిపూల వేడుకకు సిద్ధం