
డిసెంబర్ చివరి నాటికి సాగునీరు
వేలేరు: గండి రామారం లిఫ్ట్ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి వేలేరు, చిల్పూరు మండలాలకు సాగునీరు అందిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 13 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 19 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో సర్వనాశనం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని విమర్శించారు. తనను రాజీనామా చేయమనే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని, ఆనాడు బీఆర్‌ఎస్‌లో చేరిన 36 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది నాయకులు తమ స్థాయి మరిచి సభ్యత, సంస్కారం లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎవరెంత రెచ్చగొట్టినా తాను రెచ్చిపోనని స్పష్టం చేశారు. 21 నెలల తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవిత, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, అశోక్, రణధీర్ రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్‌ఎస్
ఎవరు రెచ్చగొట్టాలని
చూసినా రెచ్చిపోను
ఎమ్మెల్యే కడియం శ్రీహరి