
విద్యారంగంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధం
పండుగలకు ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వరంగల్ రీజియన్ పరిధిలో 1,284 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీలు 42శాతం రిజర్వేషన్ కోసం పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
ఐనవోలు: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని సంస్కరించి పలు అంశాల్లో మార్పులు చేయడానికి సిద్ధమవుతుండడం శుభ పరిణామమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సింగారం ప్రభుత్వ పాఠశాలకు హాజరైన శ్రీపాల్‌రెడ్డి విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేయడంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజనం అందించే కార్మికులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం నిధులు పెంచాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించాలని, ప్రతీ తరగతికి ఉపాధ్యాయుడి కేటాయింపుతో పాటు ప్రతీ స్కూల్‌కు హెచ్‌ఎంను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పదోన్నతి పొందిన భైరెడ్డి ఫాతిమారెడ్డి, పోరిక అన్నపూర్ణ, దామెర పద్మను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ ఖాతా వెంకటమ్మ, జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ హెచ్‌ఎంలు అన్నపూర్ణ, విజయ భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రశాంత్, మంజులాల్, రోజా, శ్రీరామచంద్రమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, మండల పీఆర్టీయూ నాయకులు చంద్రమోహన్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.