
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
ఐనవోలు: భూభారతిలో రైతులు చేసుకున్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి తహసీల్దార్ విక్రమ్‌కుమార్‌ను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. మండలంలో కొనసాగుతున్న భూభారతి దరఖాస్తుల ఫైళ్లను పరిశీలించారు. వీలైనంత త్వరగా ఎంకై ్వరీ జరిపించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు 60 దరఖాస్తులు పరిష్కరించినట్లు తహసీల్దార్ తెలుపగా.. వచ్చే వారంలో మరో 100 దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి సలహాలు, సూచనలిచ్చారు. డీటీ రాజ్‌కుమార్, ఎంఆర్‌ఐ రాణి, ఆర్‌ఐ మల్లయ్య పాల్గొన్నారు.