
విత్తనోత్పత్తిలో మెళకువలు పాటించాలి
● శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్ కృష్ణ
కమలాపూర్: రైతులు విత్తనోత్పత్తిలో తగిన మెళకువలు పాటించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్ ఎల్.కృష్ణ సూచించారు. ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవ్తేతల బృందం కమలాపూర్ మండలంలోని గూడూరు, ఉప్పల్ గ్రామాల్లో శుక్రవారం వరి, కంది పంటల క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి, పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం పెంచుకుని యూరియా వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు భార్గవి, డాక్టర్ పద్మజ, మండల వ్యవసా య అధికారి ఎం.రాజ్‌కుమార్ తదితరులున్నారు.