
అట్రాసిటి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గత సమావేశంలో చర్చించి తీసుకున్న చర్యల గురించి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. ప్రస్తుతం ఇంకా 26 కేసు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఏసీపీ శుభం ప్రకాశ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో బాధితులకు పోలీస్ శాఖ తరఫున పూర్తి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, గిరిజన సంక్షేమాధికారి సౌజన్య, ఎకై ్సజ్ అధికారి మురళి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, ఏసీపీలు రవీందర్, వెంకటేష్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మహేందర్, స్వామి, యాదగిరి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగులు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఎరిక్షన్ టీపీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇంటిగ్రో ఆస్పత్రి, ప్రమోద ఆస్పత్రి హనుమకొండ సౌజన్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి అధికారి రాంరెడ్డి, వైద్యులు సందీప్, లిల్లీ, విష్ణువర్ధన్, పవన్, సెర్ఫ్ సిబ్బంది, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.