
నిరాదరణ బాలలకు విద్యనందించడమే లక్ష్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
న్యూశాయంపేట: నిరాదరణకు గురైన బాలలకు విద్యను అందించడమే అందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల ఎన్టీఆర్ నగర్‌లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్‌కు వలస వచ్చి ఆపరేషన్ ముస్కాన్‌లోని గుర్తించిన బాలలకు ఆయన తల్లిదండ్రుల సమక్షంలో ఎడ్యుకేషన్ కిట్లను సీపీ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాలో భాగంగా పోలీసు, ఇతర శాఖల సహకారంతో బడి బయట ఉన్న పిల్లల్ని, బాల కార్మికులు, నిరాదరణ కలిగిన పిల్లల్ని గుర్తించిన అనంతరం వారి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. పూర్తి స్థాయి పునరావాసం పిల్లలకు కలగాలంటే వారికి విద్య అందించడమే ప్రాథమిక లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బద్రినాయక్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఏనుమాముల ఎస్‌హెచ్‌ఓ సురేశ్‌కుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ వసుధ, ఎఫ్‌ఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, డాన్ బాస్కో ఎన్జీఓ ఫాదర్ కోసి, సంస్థ కో–ఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, అజయ్‌కుమార్, సిబ్బంది ఎస్‌ఐ సుధాకర్, శ్రీనివాస్, రామారావు, భాగ్యలక్ష్మి, సమయుద్దీన్, పాషా, ఏనుమాముల ఎస్‌ఐలు రాజు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.