
ఓటరు లిస్ట్‌పై ‘ఎస్‌ఐఆర్’ చేపట్టాలి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: ప్రణాళిక ప్రకారం ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్‌తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్‌ల నుంచి కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద పాల్గొన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.