
నగదు ఎలా రికవరీ చేస్తారు?
శాయంపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం అవినీతి ఆరోపణలు, ఇన్ బ్యాలెన్స్ తగ్గింపులో విఫలమవడం వల్ల పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్లు డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. పాలకవర్గాన్ని రద్దు చేసినప్పటికీ అక్రమాలకు పాల్పడిన రూ.15లక్షలు ఎలా రికవరీ చేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. శాయంపేట పీఏసీఎస్‌లో రూ.15 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారని, రూ.10.54 కోట్లు ఇన్ బ్యాలెన్స్‌గా ఉండడంతో జూలై నెల 3న డీసీఓ సంజీవరెడ్డి పీఏసీఎస్ పాలకవర్గానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేశారు. రికవరీ మరింత జాప్యం జరిగే పరిస్థితి కనబడుతోంది. రికవరీ ఎలా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.