
అథ్లెటిక్స్ మీట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దాం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలపై వివిధ క్రీడా సంఘాలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొననున్నట్లు క్రీడా సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పోటీల వివరాల్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించేందుకు ఈనెల 15 లేదా 16 తేదీల్లో స్వయంగా కలవనున్నట్లు తెలిపారు.
డీవైఎస్‌ఓకు ఎమ్మెల్యే అభినందనలు
ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అభినందించారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి శనివారం డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన అశోక్‌కుమార్ క్రీడాకారులకు ఆదర్శమన్నారు. అంతకుముందు క్రీడా సంఘాలు, డీఎస్‌ఏ కోచ్‌ల ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అశోక్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు వరదరాజేశ్వర్‌రావు, బాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులున్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి