
జాతీయ లోక్ అదాలత్‌ల తీర్పు అంతిమం
న్యాయవాదులకు శిక్షణ అవసరమే
– 8లోu
పరకాల: జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారించుకోవడం వల్ల అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.సాయిశరత్ స్పష్టం చేశారు. జాతీయ లోక్ అదాలత్ తీర్పును అంతిమంగా భావించాలని సూచించారు. శనివారం పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈలోక్ అదాలత్‌లో పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, అదనపు న్యాయమూర్తి శ్రీవల్లి శైలజ, రెండవ తరగతి మెజిస్ట్రేట్ కొప్పుల ఈశ్వర్ 3 సివిల్ కేసులు, 1,119 క్రిమినల్ కేసులు, 6 బ్యాంకు కేసులు మొత్తం 1,128 కేసుల్ని పరిష్కరించారు. ఈసందర్భంగా పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించడం వల్ల ఫిర్యాదుదారులతో పాటు ప్రతివాదులకు సమాన న్యాయం లభిస్తుందన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లతో పాటు చట్టాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరమని సూచించారు. కక్షిదారులు క్షణికావేశంలో చేసిన నేరాలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, రవికుమార్, పరకాల డివిజనల్‌లోని పోలీసులు పాల్గొన్నారు.
పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్
లోక్ అదాలత్‌లో 1,128 కేసులు పరిష్కారం
హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
డీసీసీబీ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు