
కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలి
కొండపల్లి–కొత్తపల్లి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని కొండపర్తి గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. రెండేళ్లుగా ఆర్‌అండ్‌బీ రోడ్డును పూర్తి చేయకుండా వదిలేయడంతో రోడ్డు అధ్వానంగా మారిందని, ప్రమాదాలబారిన పడుతున్నామని కలెక్టర్ ఎదుట ఏకరువుపెట్టారు. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డు గుంతలమయంగా తయారైందని రోడ్డుపై ప్రయాణించే పరిస్థితులు లేవని పనులు వదిలేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు, పనులు వెంటనే చేపట్టాలని కొండపర్తి వాసులు కోరారు. స్పందించిన కలెక్టర్ ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారిని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.