
యూజీడీపై కమిషనర్ సమీక్ష
వరంగల్ అర్బన్: వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టంపై హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్‌టీపీలు, స్ట్రాం వాటర్ డ్రెయినేజీలు తదితర అంశాలపై చర్చించారు. బల్దియా ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, ఇరిగేషన్ ఈఈ కిరణ్, డీఈలు హర్షవర్ధన్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పనులపై..
నయీంనగర్: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కుడా వైస్ చైర్‌పర్సన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. నగరంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో (కేఎంజీ) కుడా ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫౌంటేన్, గ్రీనరీ, లైటింగ్, పాత్‌వే పనులు పురోభివృద్ధిలో ఉన్నాయన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.