క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Sep 1 2025 2:13 AM | Updated on Sep 1 2025 2:13 AM

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

జూడో అసోసియేషన్‌ రాష్ట్ర

అధ్యక్షుడు కై లాశ్‌యాదవ్‌

ఖిలా వరంగల్‌: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని జూడో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కై లాశ్‌యాదవ్‌, జిల్లా యువజన క్రీడా మండలి అధికారి సత్యవాణి అన్నారు. జాతీయ క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన క్రీడా మండలి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలు ఆదివా రం సాయంత్రం ఖిలా వరంగల్‌ కోటలో అట్టహా సంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై సైకిల్‌ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. క్రీడా పాలసీని అతి త్వరలో జిల్లాల వారీగా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడా యూనివర్సిటీ, క్రీడా పాఠశాలలను నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేసి అభినందించా రు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్‌ దామోదర్‌, నెహ్రూ యువ కేంద్రం అన్వేశ్‌, వేమ, నిశాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement