
సంతానంపై అవగాహన పెరిగింది
● హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
హన్మకొండ చౌరస్తా : తెలంగాణలో సగటు సంతానోత్పత్తి రేటు 1.6కు చేరుకుందని, దంపతులకు సంతానంపై అవగాహన పెరిగిందని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో ఉందని, ఈ ఏడాది థీమ్ ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ, మానసిక, శారీరక ఆరోగ్యంపై దంపతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు పోచమ్మకుంట, పెద్దమ్మగడ్డ ఆరోగ్య కేంద్రాలు, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం వైద్య సిబ్బంది, సెయింట్ ఆన్స్ నర్సింగ్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.