
రైతులకు అందుబాటులో యూరియా
ధర్మసాగర్ : మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో యూరియా అందుబాటులో ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు.ఈమేరకు శుక్రవారం ఎరువుల గోదాంను సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ కేంద్రాల ద్వారా యూరియా అందుబాటులో ఉంటుందని రైతులు వదంతులు నమ్మెదని వెల్లడించారు.పంటల అవసరానికి మాత్రమే యూరియాను తీసుకు వెళ్లాలని రైతులకు సూచించారు. సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య తదితరులు ఉన్నారు.
డీఏఓ రవీందర్‌సింగ్