
రైతుల సంక్షేమానికి పెద్దపీట
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ్ మిషన్ ఆధ్వర్యంలో పప్పు దినుసుల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అలాగే, కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం (భద్రత కిట్) అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, సహాయ వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జాతీయ ఆహార భద్రతా కన్సల్టెంట్, పి.సారంగం, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, పాల్గొన్నారు.