
రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాయపర్తి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయపర్తి మండలకేంద్రంలో రూ.14.17 కోట్ల వ్యయంతో 20 మె ట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం ఇస్తున్న ప్ర భుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఆర్థిక సంక్షో భం ఉన్నా.. ప్రజా సంక్షేమం ఆగకుండా పని చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానికం’లో కాంగ్రెస్ జెండా
ఎగురవేయాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి