
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు వేగవంతం చేయాలి
రాయపర్తి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం రాయపర్తి మండలంలోని మైలారం, రాగన్నగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ని ర్మాణాలు చేపట్టాలన్నారు. మేసీ్త్రలు, కాంక్రీట్, సి మెంట్, ఇసుక, ఐరన్ ధరలు ఏవిధంగా ఉనన్నాయ ని అడిగి తెలుసుకునన్నారు. అనంతరం రాగన్నగూడెంలో ఈజీఎస్ కింద నిర్మిస్తున్న పాంపాండ్, రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలను పరిశీలించారు. తిర్మలాయపల్లిలోని కేజీబీవీని పరిశీ లించి పలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ, ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి రామిరెడ్డి, హౌసింగ్ డీఈ గణపతి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, తహసీలల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద