
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా రెవెన్యూ 54, గృహనిర్మాణం 20, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీఐ, గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించి ఈ–ఫైలింగ్‌లో సర్క్యూలేట్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా తదితర శాఖలు శాఖాపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రేషన్‌షాపులను మహిళా సంఘాలకు కేటాయించాలి
జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు మహిళా గ్రూపులకు కేటాయించాలి. మహిళలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా వరకు రేషన్‌డీలర్లకు రెండేసి షాపులున్నాయి. వాటిని మహిళలకు కేటాయించాలి.
– కలకోట్ల మాలతి, చింతల్
ప్రభుత్వ భూమిని కాపాడాలి
వరంగల్‌లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్‌ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్‌కుమార్, వరంగల్
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో 130 దరఖాస్తులు

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

సమస్యలు త్వరగా పరిష్కరించాలి