రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత

Jul 1 2025 3:48 AM | Updated on Jul 1 2025 3:48 AM

రెసిడ

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత

పరకాల: పరకాల మండలం మల్లక్‌పేట శివారులోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(గర్ల్స్‌)లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెసిడెన్షియల్‌ స్కూల్‌లోని బాత్రూంలో పరకాలకు చెందిన విద్యార్థిని శ్రీవాణి(15) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాలిక ప్రాణాలతోనే ఉందని ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారి, సిబ్బంది మరో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లతో కలిసి ఆటోలో పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, విద్యార్థిని అప్పటికే చనిపోయింది. రెసిడెన్షియల్‌ ప్రిన్సిపాల్‌ తమకు తప్పుడు సమాచారం అందించారంటూ, కూతురు చావుకు కారణం తెలియాలంటూ మల్లక్‌పేట రెసిడెన్షియల్‌ ఎదుట తల్లిదండ్రులు ఏకు ఈశ్వర్‌, నీల ఆందోళన చేపట్టారు. బాలిక మృతి సమాచారం తెలియగానే పరకాల పోలీసులు రెసిడెన్షియల్‌లో విచారణ జరుపుతుండగానే గేట్‌ను నెట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థిని మృతికి ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారి, ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమంటూ గొడవ చేశారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారితోపాటు ఉపాధ్యాయురాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ రెసిడెన్షియల్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల వేధింపులు ఆగాలంటే ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారితో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు?

గర్ల్స్‌ హాస్టల్‌లో ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయంటూ కొందరు ఉపాధ్యాయురాళ్లు తమ పిల్లలను వేధిస్తున్నారంటూ ఆందోళనలో పాల్గొన్న మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. బాలికల మధ్య ప్రేమవ్యవహారాలేంటి? అని తాము అనేకమార్లు ఉపాధ్యాయురాళ్లను నిలదీసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పిల్లలను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ నోటి దురుసుతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, తన కూతురు మృతికి కారణమైన ప్రిన్సిపాల్‌ కృష్ణకుమారి, హౌస్‌ మాస్టర్‌ మీరాబాయితోపాటు పీఈటీ, అసిస్టెంట్‌ కేర్‌ టేకర్‌, స్వీపింగ్‌ శానిటేషన్‌ కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఏకు ఈశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యార్థిని మృతితో పరకాల(మల్లక్‌పేట) టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో విషాదం

బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన

ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు.. భరించలేకపోతున్నామంటున్న

విద్యార్థినులు

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత1
1/3

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత2
2/3

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత3
3/3

రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement