
డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం అధికారులకు సన్మానం
గీసుకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు మంగళవారం డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులను సన్మానించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఎఓలు ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఎస్‌ఓ విజయలక్ష్మి, డీపీఓ అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.