
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
ఎల్కతుర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. బుధవారం ఆయన ఎల్క తుర్తి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ప్రవీణ్‌కుమార్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. సిబ్బంది నిర్వహించిన పరేడ్‌తోపాటు కిట్ ఆర్టికల్స్‌ను సీపీ తనిఖీ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్‌చేసిన వాహనాలను పరిశీలించారు. వీటికి సంబంధించిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్, కోర్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులపై ఆరా తీసి పలు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందితో నేరుగా మాట్లాడి శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించడంతోపాటు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ఇందుకు ప్రతీ పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. ఆయన వెంట సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేష్ తదితరులు ఉన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్ తనిఖీ

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి