కొత్త రేషన్‌కార్డుల జారీని వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త రేషన్‌కార్డుల జారీని వేగవంతం చేయాలి

Jul 2 2025 7:26 AM | Updated on Jul 2 2025 7:26 AM

కొత్త రేషన్‌కార్డుల జారీని వేగవంతం చేయాలి

కొత్త రేషన్‌కార్డుల జారీని వేగవంతం చేయాలి

న్యూశాయింపేట: కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన, రేషన్‌కార్డుల్లో అదనంగా పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో డిఫాల్టర్‌ రైస్‌మిల్లర్స్‌, రేషన్‌ కార్డుల పంపిణీ, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవం ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్‌ రైస్‌మిల్లర్ల జాబితా సిద్ధం చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డు లబ్ధిదారుల్లో డెత్‌ కేసులు ఉంటే గ్రామపంచాయతీల నుంచి నివేదికలు సేకరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల ఆన్‌లైన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా పెట్రోల్‌ బంకుల స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసీల్లార్లకు సూచించారు. పీఎం కుసుమ ప్రాజెక్టు కింద సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఈఓ జ్ఞానేశ్వర్‌తో కలిసి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

జిల్లాలో నేషనల్‌ స్టూడెంట్స్‌ పర్యావరణ పోటీ–2025 పోస్టర్‌ను కలెక్టర్‌ సత్యశారద కార్యాలయంలో ఆవిష్కరించారు. డీఈఓ జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు.

అధికారుల సమీక్షలో

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement