పండుటాకుల పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

పండుటాకుల పడిగాపులు

Jul 1 2025 3:48 AM | Updated on Jul 1 2025 3:48 AM

పండుటాకుల పడిగాపులు

పండుటాకుల పడిగాపులు

నెక్కొండ: వృద్ధులు అని చూడకుండా పింఛన్‌ కోసం వచ్చిన వారిని పోస్టాఫీస్‌ చుట్టూ రోజూ తిప్పుతున్నారని పింఛనుదారులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు చెట్ల కింద పడిగాపులు కా యాల్సి వస్తోందన్నారు. ఒకవేళ అధికారులు వ చ్చినా మిషన్‌ పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్పుతున్నారని ఆరోపించారు. సార్‌ వచ్చినప్పుడు ఇస్తారని, రేపు మాపు అంటూ ప్రతీనెల తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ అక్షయ్‌కుమార్‌, సబ్‌ పోస్టు మాస్టర్‌ రత్నమాలను వివరణ కోరగా స్థానిక పోస్టాఫీస్‌లో పర్మనెంట్‌ ఉద్యోగి లేరని, నల్లబెల్లిలో పనిచేస్తున్న ఉద్యోగికి బాధ్యతలు అప్పగించామని, అక్కడ పని ముగించుకుని ఇక్కడి రాగానే పింఛన్‌ ఇస్తారన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాకు

అంతరాయం

నర్సంపేట: విద్యుత్‌ సరఫరాకు నేడు (మంగళవారం) అంతరాయం ఉంటుందని విద్యుత్‌ నర్సంపేట ఆపరేషన్‌ డీఈ తిరుపతి, చెన్నారావుపేట విద్యుత్‌ ఏఈ జోగ్యానంద్‌లు సోమవారం తెలిపారు. 33/11కేవీ చెన్నారావుపేట ఉపకేంద్రంలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ క్రమబద్ధీకరించే క్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

జిల్లాలో మోస్తరు వర్షం

సాక్షి, వరంగల్‌: జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. గత గురువారం కురిసిన వర్షంతో పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పంటలకు మరింత ఊపిరి పోసినట్లయింది. పత్తిలో మొలకెత్తని చోట మళ్లీ విత్తులు విత్తడంతో పాటు వరి పంటకు నారు పోసేందుకు కూడా రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మోస్తరు వర్షం పంటకు కాస్త ఊపిరి పోసినా.. ఇంకా భారీవర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండే అవకాశముందని వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.

ఖానాపురంలో అధిక వర్షం

ఖానాపురం మండలంలో అత్యధికంగా 46.4 మిల్లీమీటర్లు, నర్సంపేట 37.2 మి.మీలు, దుగ్గొండిలో 35.6 మిమీలు, నల్లబెల్లిలో 33.2, చెన్నారావుపేటలో 30.2, వరంగల్‌లో 23.2, గీసుకొండలో 22.8, ఖిలావరంగల్‌లో 21.8, సంగెంలో 20.2, వర్ధన్నపేటలో 17.8, నెక్కొండలో 15.4, రాయపర్తిలో 13.6, పర్వతగిరిలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వ్యవసాయరంగాన్ని

నిర్వీర్యం చేస్తున్న పాలకులు

సంగెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సోమిడి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కాపులకనిపర్తిలో ఆదివారం రాత్రి రైతు సంఘం ఆధ్వర్యంలో షార్ట్‌ ఫిలింను ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ కన్వీనర్‌ పేరాల ప్రభాకర్‌, ఓదెల రాజయ్య, ఆవునూరి రాజు, బోనాల గోపాల్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement