
మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నేడు జాబ్‌మేళా
న్యూశాయంపేట: హైదరాబాద్‌లోని వీవీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉద్యోగాలకు శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప న అధికారి టి.రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ (30), ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (30), షోరూం హోస్ట్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (60), స్పెర్ పికర్ (15), టెలికాలర్(15), అసెసరీర్స్ (10) ఉద్యోగాలకు హనుమకొండ ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొ మా, డిగ్రీ అర్హత కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు తగిన సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాల కోసం 7093168464 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
ఫర్టిలైజర్ షాపుపై దాడులు
● గడువు దాటిన రూ.14,95, 993 విలువైన ఎరువులు,
పురుగు మందులు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్
ఏసీపీ మధుసూదన్
నల్లబెల్లి: మండలంలోని రేలకుంటలో దేవా సుధీర్‌బాబు ఫర్టిలైజర్ షాపుపై టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. రేలకుంట గ్రామానికి చెందిన దేవా సుధీర్‌బాబు తన ఫర్టిలైజర్ షాపులో గడువుదాటిన ఎరువులు, పురుగు మందులు అక్రమంగా నిల్వ చేశాడనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. గడువు దాటిన రూ.14,95,993 విలువైన ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ పవన్‌కుమార్, ఎస్సై వంశీకుమార్, ట్రైనీ ఎస్సై తేజ, ఏఓ బన్న రజిత తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలపై
జాగ్రత్తగా ఉండాలి
హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్‌ఈలు కె.గౌతంరెడ్డి, మధుసూదన్ రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. సొంతంగా విద్యుత్ సంబంధ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పేర్కొన్నారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరులు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. తీగలు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీనంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు.