
పదవిని కాపాడుకోవడానికే ఎమర్జెన్సీ
● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావు
గీసుకొండ: పదవిని కాపాడుకునేందుకు 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ పేరుతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, పార్టీలను ఎన్నో ఇబ్బందులు, ని ర్బంధాలకు గురిచేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, పార్లమెంటరీ విధానాన్ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలి కారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పేరుతో పౌర ప్రాథమిక హక్కుల ను కాలరాసిందని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ రోజు ల్లో జైలు శిక్ష అనుభవించిన భారత సురక్ష సమితి ప్రతినిధులు చిట్టిమల్ల శ్యాంప్రసాద్, చామర్తి ప్రభాకర్, యార ప్రభాకర్‌తో పాటు మరో 20 మందిని నాయకులు సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీశ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, రాష్ట్ర, జిల్లా నాయకులు రత్నం సతీష్‌షా, గురుమూర్తి శివకుమార్, బాకం హరిశంకర్, రాణాప్రతాప్, సముద్రాల పరమేశ్వర్ పాల్గొన్నారు.