
‘జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్’పై అవగాహన
పర్వతగిరి: మండలంలోని రావూరు శివారు గుగులోత్‌తండాలో జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్‌పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులు ఆధార్, కులం, రేషన్ కార్డు, నివాసం, ఐసీడీఎస్ పోషణ్ అభియాన్, పీఎంజేఏవై ఆయుష్మాన్ భారత్, పీఎం మాతృ వందన, టీవీ ముకుత్‌భారత్, నిక్షన్ పోషణ్, మిషన్ ఇంద్రధనుస్సు, పీఎం జన్‌ధన్ యోజన, స్టాండప్ ఇండియన్ స్కీం, ముద్ర యోజన, వన్‌ధన్ యోజన, పీఎం విశ్మకర్మ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం కిసాన్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ఏ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పంచాయతీ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సదస్సులో ఎంపీడీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.