
జిల్లా ఉద్యానశాఖ అధికారిగా శ్రీనివాసరావు
హన్మకొండ: జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్‌కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంగీతలక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉద్యాన శాఖ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జి.అనసూయకు హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా..కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పనిచేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు.