భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
బక్రీద్ పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలకు ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈద్గాలను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. – మరిన్ని వివరాలు, ఫొటోలు: 9లో
భక్తిశ్రద్ధలతో బక్రీద్


