అసంపూర్తిగానే..!
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్‌లోనే పనులు
రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించినా పైపులైన్లు బిగించలేదు. వాటర్ ట్యాంక్‌లు కూడా అమర్చలేదు. మరుగుదొడ్లకు తలుపులు బిగించలేదు. ఫలితంగా పాఠశాలకు సమీపంలోని బహిరంగ ప్రాంతంలో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు 220 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలల్లో పనులు చకచక చేస్తేనే ఫలితం ఉండనుంది.
నర్సంపేట జెడ్పీహెచ్‌ఎస్ మోడల్ పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. పాత మరుగుదొడ్ల పైన పాత రేకులనే ఉంచి కాస్తా ముస్తాబు చేయగా.. కొత్త మరుగుదొడ్లకు మాత్రం స్లాబ్‌లు వేశారు. ఒక మరుగుదొడ్డికి తలుపు బిగించడం మరిచిపోయారు. వీటిపైన వాటర్ ట్యాంక్‌లు బిగించలేదు. నీటి కనెక్షన్ ఇవ్వలేదు. బడి పెయింటింగ్ పనులు పూర్తిస్థాయిలో కాలేదు.
వరంగల్ నగరంలోని కృష్ణకాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. వాటర్ ట్యాంక్ అమర్చలేదు. ఈ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. పనులు పూర్తయితే బాలికలకు తిప్పలు తప్పనుంది. పాఠశాల పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెబుతున్నారు.
అసంపూర్తిగానే..!
అసంపూర్తిగానే..!
అసంపూర్తిగానే..!


