కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
● ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్
గీసుకొండ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పీడ కలలు కంటున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌కే ప్రభాకర్ అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పదకొండేళ్ల మోదీ పాలనపై జిల్లా కార్యశాల నిర్వహించిన సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ సాధించిన విజయా ల గురించి ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రజలకు వివరించడానికి ప్రతీ కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, కార్యక్రమ కోకన్వీనర్లు వడ్డేపల్లి నర్సింహులు, ముండ్రాతి వెంకటేశ్వర్లు, బీజేపీ కార్యాలయ కార్యదర్శి క్రాంతికుమార్, నాయకులు పాల్గొన్నారు.


