తొలగింపా.. విలీనమా? | - | Sakshi
Sakshi News home page

తొలగింపా.. విలీనమా?

May 29 2025 1:03 AM | Updated on May 29 2025 1:03 AM

తొలగి

తొలగింపా.. విలీనమా?

కాజీపేట అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలో ప్రైవేట్‌ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్‌ నాయకులతో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కార్పొరేషన్‌లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్‌లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా..

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్‌ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్‌లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్‌లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖతో ముడిపడిన ఉద్యోగం తప్ప వేరే పనులు చేసుకోలేని స్థితిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో వారిని పర్మనెంట్‌ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా.. కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ఎదురుచూస్తున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి..

రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఆదాయం అందజేయడంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. ఏళ్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి.

– మోతె శ్రీనివాస్‌రెడ్డి, ఔట్‌సోర్సింగ్‌

ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్‌ అందజేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్‌లోని టీఎన్జీఓస్‌ భవన్‌లో, సెక్రటేరియట్‌లో వినతులు అందజేశాం.

కార్పొరేషన్‌లోకి రిజిస్ట్రేషన్‌ శాఖ

ఔట్‌సోర్సింగ్‌

ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం

– జగన్‌, ఔట్‌సోర్సింగ్‌

అసోసియేషన్‌ సభ్యుడు

తొలగింపా.. విలీనమా? 1
1/2

తొలగింపా.. విలీనమా?

తొలగింపా.. విలీనమా? 2
2/2

తొలగింపా.. విలీనమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement