
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
రాయపర్తి/పర్వతగిరి/ నల్లబెల్లి: రైతులకు నాణ్యతలేని కల్తీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ (పెస్టిసైడ్ టెస్టింగ్ లాబోరేటరి) అధికారి విజయభాస్కర్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని మైలారం, కొండూరు, రాయపర్తి, కాట్రపల్లి గ్రామాల్లో ఏఓపీటీఎల్ సీహెచ్ రంజిత్, మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రంతో కలిసి సీడ్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్లు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. గడువు ముగిసిన, నకిలీ విత్తనాలు విక్రయించొద్దని తెలిపారు. నిషేధించిన బీటీ–3 విత్తనాలను కొనుగోలు చేయొద్దని తెలిపారు. కొండూరులోని శ్రీరాజరాజేశ్వర ఏజెన్సీస్ షాపులో బిల్‌బుక్కు, స్టాక్ రిజిస్టర్ సరిగ్గా మెయింటనెన్స్ లేకపోవడంతో రూ.3,15000 విలువ చేసే ఆ షాపులోని 350 పత్తి విత్తనాల ప్యాకెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పర్వతగిరి మండల వ్యవసాయ అధికారి టీవీఆర్‌ఆర్ ప్రశాంత్‌కుమార్ మండలంలో వ్యవసాయశాఖ, పోలీసు శాఖలతో కలిసి విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. నల్లబెల్లి మండలంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు పి.గోవర్ధన్‌రెడ్డి, కె.లలిత, బి.సుధాకర్, పోలీసులు శ్రావణ్‌కుమార్, జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు రంజిత్ రెడ్డి, రామ్మోహన్, బన్న రజిత, ఏఈఓలు సాయి, క్రాంతి, మనస్విని పాల్గొన్నారు.
ఏడీఏపీటీఎల్ విజయభాస్కర్