
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి..
హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు
హన్మకొండ అర్బన్/వరంగల్: ఈనెల 4న జిల్లాలో నిర్వహించనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, సత్యశారద తెలిపారు. ఆయా కలెక్టరేట్లలో వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు సరిపడా బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కి ట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: సీపీ
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఈనెల 4న (ఆదివారం) జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలున్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండలో 11 కేంద్రాలు, హనుమకొండ జిల్లాలో 4,680 మంది విద్యార్థులు, వరంగల్ జిల్లాలో ఒక పరీక్ష కేంద్రంలో 240 మంది పరీక్ష రాయనున్నారు. జనగామలో 2 పరీక్ష కేంద్రాలున్నట్లు తెలిపారు. జనగామలో 580 మంది విద్యార్థులు మొత్తం 5,260 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు.. సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగడం నిషేధమని, పరీక్ష పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసేయాలని కోరారు.
హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు