
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 14న అంబేడ్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. అంబేడ్కర్ భవన్‌లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్‌రావు, వైస్ చైర్మన్ బండారి సురేందర్, ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీలత, అధికారి అనిల్ పాల్గొన్నారు.