
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అరిగోస
పర్వతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఎంపీటీసీల క్లస్టర్ల వారీగా సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. వారం రోజుల్లో పంటలకు సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నీళ్ల కోసం తాను పాదయాత్ర చేస్తే కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద లాఠీదెబ్బలు తిన్నానని గుర్తుచేశారు. ఒక బ్లాక్‌మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం బాధాకరం అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోరిక రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీలిమిటేషన్‌తో వర్ధన్నపేట జనరల్..
డీలిమిటేషన్‌లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్‌గా మారనుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో జనరల్‌గా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని చెప్పారు. సంగెం మండలాన్ని పరకాలలో,హసన్‌పర్తి మండలాన్ని వర్ధన్నపేట, రాయపర్తి మండలాన్ని పాలకుర్తిలో కలిపారని చెప్పారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు