
వరంగల్
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
తెలంగాణ ఉద్యమ దివిటీ దాశరథి
నైజాం రాజులను ఎదురించిన తెలంగాణ ఉద్యమ దివిటీ దాశరథి కృష్ణమాచార్యులు. నేడు దాశరథి జయంతి.
చెన్నారావుపేట మండలం లింగాపురం ఉన్నత పాఠశాలలో
తమ ఐడియాలను కాగితంలో రాసి ఐడియా బాక్స్‌లో వేస్తున్న విద్యార్థులు
25 నుంచి
రేషన్‌కార్డుల పంపిణీ
● వీడియో కాన్ఫరెన్స్‌లో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
వరంగల్ చౌరస్తా: మండల కేంద్రాల్లో ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూలై 21 వరకు రాష్ట్రంలో దాదాపు 20 శాతంలోటు వర్షపాతం నమోదైందని, మూడు రోజులుగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, డీఏఓ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గురుకులం నుంచి
తప్పించుకుపోయిన బాలిక
● గంట వ్యవధిలో ఆచూకీ
కనుగొన్న పోలీసులు
నెక్కొండ: బాలిక తప్పించుకుపోయిన సంఘటన చింతనెక్కొండ క్రాస్‌రోడ్డులోని టీజీ గురుకుల పాఠశాలలో సోమవారం జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అప్పయ్య కుమార్తె అక్షిత ఇటీవల ఐదో తరగతిలో గురుకులంలో చేరింది. తల్లిదండ్రులపై బెంగ, ఇక్కడ చదవడం ఇష్టం లేకపోవడంతో బాలిక మూడీగా ఉండేది. ఈ క్రమంలో పాఠశాల నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని బయటకు వెళ్లింది. కాగా, సాయంత్రం 4.30 గంటలకు రోల్‌కాల్ (సాయంత్రం అసెంబ్లీ)లో బాలిక లేదన్ని విషయాన్ని గురుకుల ఉపాధ్యాయులు గమనించారు. దీంతో పాఠశాల ఆవరణలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళనకు గురైన ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు టీంలుగా ఏర్పడి గాలించారు. ఓ ద్విచక్రవాహనంపై బాలిక అలంకానిపేట వరకు వెళ్తోంది. ఇది గమనించిన పోలీసులు బాలికను పాఠశాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. గంట వ్యవధిలో బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులను పలువురు అభినందించారు.
స్థానిక ఎన్నికలకు
సన్నద్ధం కావాలి
పర్వతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీశ్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీ తరపున సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి మాట్లాడుతూ రేషన్ కార్డులు, సన్నబియ్యం, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, సీసీరోడ్లు, రైతు వేదికలు, గ్రామాల్లోని డంపింగ్ యార్డులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు బత్తిని దేవేందర్, జాటోత్ రవి, మండల ఉపాధ్యక్షుడు పాయిలి యాకన్న, మండల యువమోర్చా అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గోనె సంపత్, సీని యర్ నాయకులు ఏకాంతంగౌడ్, చీమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఐతో విద్యాబోధన
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించారు.
సాక్షి, వరంగల్: విద్యార్థులే శాస్త్రవేత్తలయ్యే అవకాశం.. వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు చక్కని వేదిక.. ఇలా విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచన శక్తిని పెంపొందించి ఆవిష్కరణలు, పరిశోధనల వైపు ఆసక్తిని కల్పించేందుకు కేంద్రం ఏటా ‘ఇన్‌స్పైర్ మనాక్’ అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ విద్యాసంవత్సరం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విద్యార్థుల్లో ఉన్న సరికొత్త ఆలోచనలను తెలుసుకునేందుకు ఆయా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ‘ఐడియా బాక్స్’లకు విశేష స్పందన లభిస్తోంది. సమాజంలో నెలకొన్న వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనే తమ ఆలోచనలను ఓ కాగితంలో రాసి ఆ ఐడియా బాక్స్‌లో వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ సొల్యూషన్స్, సస్టెయినబుల్ టెక్నాలజీ, యాక్సెసబులిటీ అండ్ అసిస్టివ్ డివైజెస్, ఇతర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న ఈ బాక్స్‌ల్లోని కాగితాలను రెండు వారాలకోసారి చదువుతున్న ఉపాధ్యాయులు మెరుగ్గా ఉన్న వాటిని పక్కనబెడుతున్నారు. సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అప్పటివరకు ఇంకా వీటికి మించి మెరుగైన ఐడియాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇలా విద్యార్థులతోనే ఆలోచనలు రప్పించి, ఆ తర్వాత ఉపాధ్యాయుడు కూడా సహకరించి వారి ప్రాజెక్టులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో శభాష్ అనిపించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025– 26 ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల కోసం పోటీపడుతున్నారు. 2024–25లో రెండు ఆలోచనలు జాతీయస్థాయికి ఎంపికై న సంగతి తెలిసిందే. రాయపర్తి మండలంలోని కేశవపూర్ హైస్కూల్ నుంచి అడ్జస్టబుల్ అప్పర్ బెర్త్ ల్యాడర్ ఇన్ ట్రైన్, వర్ధన్నపేట ఆల్ఫోర్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు రూపొందించిన తీయడానికి వీలులేని చెత్తను ట్రాలీయే తీసుకునే ఆలోచన జాతీయస్థాయికి ఎంపికై ంది.
విద్యార్థులను ప్రోత్సహించాలి..
విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంచడానికి, పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను, వారి ఆలోచన శక్తిని తట్టి లేపడానికి ఇన్‌స్పై ర్ మనాక్ అవార్డులు సదావకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రాజెక్టులు రూపొందించాలి. పాఠశాలల్లో ఐడియా బాక్స్, ఐడియా కాంపిటిషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం ద్వారా వినూత్న ఆలోచనలను విద్యార్థుల నుంచే రాబడుతున్నాం..
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి
ఇన్‌స్పైర్ నామినేషన్లు ఎక్కువగా ఉండాలి..
విద్యార్థులు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో పంచుకుంటూ చుట్టూ ఉండే ఎన్నో స్థానిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఇదొక మంచి అవకాశం. జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ ప్రత్యేక కార్యాచరణతో ఈ విద్యా సంవత్సరం జిల్లా తరఫున నామినేషన్ల సంఖ్య అత్యధికంగా ఉండేలా చూడాలి. ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థుల ఆలోచనలను నామినేషన్లుగా అప్‌లోడ్ చేయాలి. తద్వారా విద్యార్థుల్లో పరిశోధనాత్మక, ఆవిష్కరాణత్మక ఆలోచనలు, నైపుణ్యాలు పెంపొందుతాయి.
– మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి
●
● నిరంతర పర్యవేక్షణకు
సీసీ కెమెరాల ఏర్పాటు
● ఒక్కో జూనియర్ కళాశాలకు
14 నుంచి 16 వరకు కేటాయింపు
● విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్‌వాలా శిక్షణ
న్యూస్‌రీల్
జపాన్‌కు వెళ్లే అవకాశం..
విద్యార్థులు తమ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఉపాధ్యాయుల సహకారంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.10 వేలను విద్యార్థి ఖాతాలో నమోదు చేస్తోంది. ఆయా నిధులతో ప్రాజెక్టులు రూపొందించి జిల్లా స్థాయి ఇౖన్‌స్పైర్ మనాక్ అవార్డుల ప్రదర్శనలో పాల్గొనాలి. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయికి ఎంపికై తే రూ.20 వేల నుంచి 30 వేల వరకు నగదు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అలాగే, జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రాజెక్టులకు సకుర కార్యక్రమం ద్వారా జపాన్ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల నామినేషన్ల సంఖ్య సంఖ్యాత్మకంగా, గుణాత్మకంగా పెంచడానికి రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యాశాఖలు జిల్లా రాష్ట్రస్థాయిలో పలు దఫాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
ఆవిష్కరణలు, పరిశోధనల వైపు అడుగులు
పాఠశాలల్లో ఐడియా బాక్స్‌లకు
విశేష ఆదరణ
ఇన్‌స్పైర్ మనాక్
అవార్డుల కోసం ఆసక్తి
సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు అవకాశం
గతేడాది జాతీయస్థాయికి
జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు
జిల్లాలో గత మూడేళ్లలో ఎంపికై న ప్రాజెక్టులు
సంవత్సరం ఎంపికై న
ప్రాజెక్టులు
2022–23 146
2023–24 147
2024–25 167

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్