
యూరియా కోసం బారులు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి సొసైటీలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయం బారులు తీరారు. వారం క్రితం ఎకరానికి రెండు బస్తాల చొప్పున తీసుకున్న రైతులు సైతం క్యూలో నిల్చున్నారు. ఒక్కసారి కూడా తీసుకోని వారికి ముందు ఇస్తామని చెప్పినా వారు వినకపోవడంతో సొసైటీ చైర్మన్ రక్కిరెడ్డి మోహన్‌రెడ్డి, ఏఓ హరిప్రసాద్‌బాబు గీసుకొండ పోలీసుల సాయం కోరారు. దీంతో పోలీసులు వచ్చి పంపిణీ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. సొసైటీకి తాజాగా 444 బస్తాల యూరియా లోడ్ రాగా ఏఈఓ శ్వేత పంపిణీ చేశారు.