వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Mar 22 2025 12:58 AM | Updated on Mar 22 2025 12:58 AM

వరంగల

వరంగల్‌

ఒకే దేశం, ఒకే ఎన్నిక నష్టమే...
సమాజానికి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నష్టదాయకమని ప్రముఖ సామాజిక వేత్త, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై

ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.

8లోu

శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025

స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది.

● ఆర్టీసీ డిపోలు, వరంగల్‌ రీజియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్‌ బోర్డు ద్వారా ప్రతీబస్‌లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

● ఈ టిమ్స్‌ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది.

● ముందుగా ఆన్‌లైన్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం (ఓపీఆర్‌ఎస్‌) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు.

● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్‌ జారీకి ఇ–టిమ్స్‌ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్‌తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు.

ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్‌ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్‌ జారీ చేయవచ్చు.

– డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్‌ ఆర్‌ఎం

వరంగల్‌ రీజియన్‌లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్‌ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్‌ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం.

ఉత్సాహంగా రూబిజెస్ట్‌ – 2025

కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో రూబిజెస్ట్‌– 2025లో భాగంగా థిమ్‌ డే వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.

– 8లోu

ఆర్టీసీలో డిజిటల్‌ చెల్లింపులతో టికెట్ల జారీ

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ

వరంగల్‌ రీజియన్‌కు చేరుకున్న 750 ఇ–టిమ్స్‌

టికెట్‌ జారీపై మరింత స్పష్టత

ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం

ప్రతీది ఆన్‌లైనే..

వరంగల్‌1
1/3

వరంగల్‌

వరంగల్‌2
2/3

వరంగల్‌

వరంగల్‌3
3/3

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement