అమరుల కుటుంబాలను మరిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అమరుల కుటుంబాలను మరిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నా కూతురు కావలి సువర్ణ 2010 జనవరి 19న తెలంగాణ కోసం ఉరేసుకుని చనిపోయింది. నాడు మా బాధను పంచుకోవడానికి ఎంతోమంది నాయకులు వచ్చి ఓదార్చి వెళ్లారు. 2014లో అప్పటి ప్రభుత్వం నా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఓదార్చిన పాపాన పోలేదు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి అమరుల కుటుంబాలను కలిసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అండగా నిలవాలి.

– కావలి రాములమ్మ, మిరాసిపల్లి, కొత్తకోట మండలం

Advertisement
 
Advertisement
Advertisement