ప్రగతి పథంలో.. | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పథంలో..

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

న్యూస్‌రీల్‌

తెలంగాణ వచ్చాక ఉన్నత విద్యాలయాల ఏర్పాటు

వనపర్తి: జిల్లాకు మొదటి నుంచి విద్యాపర్తిగా పేరుంది. సంస్థానాధీశుల కాలం నుంచే పాలకులు విద్యకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. ఉన్నత విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ప్రజాప్రతినిధులుగా ఎవరు ఎన్నికై నా.. తమదైన శైలిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959లోనే వనపర్తిలో సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. సంస్థానాధీశుల రాజప్రాసాదంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతులమీదుగా పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు డిగ్రీ, పీజీ, ఉద్యాన కళాశాలలను ఏర్పాటు చేయగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫిషరిస్‌ సైన్స్‌ కాలేజీ, వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలకు వనపర్తి నిలయమైంది. అదే విధంగా నర్సింగ్‌, మెడికల్‌ కాలేజీలు సైతం సువిశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో యంగ్‌ ఇండియా స్కూల్‌ సైతం జిల్లాకు మంజూరు కాగా.. సొంత భవనంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యనభ్యసించిన వనపర్తి జిల్లా పరిషత్‌ పాఠశాల, ఇంటర్‌ కాలేజీలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 47కోట్లతో అధునాతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

రిజర్వాయర్లుగా సప్త సముద్రాలు..

వనపర్తి సంస్థానాధీశురాలైన రాణి శంకరమ్మ హయాంలో వనపర్తి చుట్టూ వర్షపునీటిని నిల్వ చేసేందుకు సప్త సముద్రాలను నిర్మించారు. అయితే జలయజ్ఞంలో భాగంగా వాటిని రిజర్వాయర్లుగా మార్చేందుకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కారు బీజం వేయగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణానీటితో నింపారు. దీంతో పాటు జిల్లాలోని సుమారు 1,075 చెరువులు, కుంటలను సైతం కేఎల్‌ఐ, బీమా, జూరాల సాగునీటి కాల్వలతో అనుసంధానం చేయడంతో జిల్లా నలుమూలల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

పెబ్బేరులోని ఫిషరీస్‌ సైన్స్‌ కళాశాల

పుష్కర తెలంగాణ..

పచ్చని పాలమూరు!

ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిన వనపర్తి

అందుబాటులోకి ఆధునిక వైద్యం

రికార్డుస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు

Advertisement
 
Advertisement
Advertisement