5 నుంచి జిల్లా ప్రశిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

5 నుంచి జిల్లా ప్రశిక్షణ శిబిరం

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

వనపర్తిటౌన్‌: జిల్లాలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రశిక్షణ ప్రభారీ గిరమోని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రశిక్షణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏప్రిల్‌ 15 నుంచి మే నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించామని, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులకు ప్రతి జిల్లాలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాకేంద్రం నాగవరంలోని సూర్యచంద్ర ప్యాలెస్‌ స్కూల్‌లో ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 250 మంది జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో నిర్వహించే శిబిరంలో మూడు రోజుల పాటు వివిధ కాలాంశాలపై 13 సెషన్లు ఉంటాయని.. ప్రతి సెషన్‌కు రాష్ట్రస్థాయి నాయకులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్టీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, మున్నూరు రవీందర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, కేతూరి బుడ్డన్న, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్‌, వారణాసి కల్పన తదితరులు పాల్గొన్నారు.

31 వేల బస్తాల

ధాన్యం రాక

నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఆదివారం 31 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్‌ 28,146 బస్తాలు రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,880, కనిష్టంగా రూ.2,212 ధర వచ్చింది. అలాగే 3 వేల బస్తాల 1010 రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,711 ధర లభించిందని మార్కెట్‌ కార్యదర్శి రమేష్‌ తెలిపారు.

డైట్‌ సెట్‌ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: డైట్‌ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాకేంద్రంలోని డైట్‌ కళాశాలలో తమ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ మేరాజుల్లాఖాన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ర్యాంక్‌ కార్డు, హాల్‌టికెట్‌, ఎస్సెస్సీ, ఇంటర్‌, కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు బోనోఫైడ్స్‌ తీసుకురావాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్‌ నం.99499 93714ను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement