సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

కొల్లాపూర్‌ రూరల్‌/భూత్పూర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ సందర్శించి.. హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్‌ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్‌, తహసీల్దార్‌ మాధవి, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌ ఉన్నారు.

భూత్పూర్‌ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి హెలీప్యాడ్‌ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్‌ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ సుశీల రెడ్యానాయక్‌, నరేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement