మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వతో పాటు అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతుండటంతో ఎలాంటి వరి వంగడాలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయనే విషయాలను రైతులకు వివరిస్తున్నాం.
– అరవింద్, ఏఓ, అమరచింత
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండోస్థానంలో పత్తి, చెరుకు, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు. ఎంత మేర విత్తనాలు, ఎరువులు కావాలనే వివరాలను ఏఓలతో సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. పంటల సాగుకు ముందే నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– ఆంజనేయులుగౌడ్,
జిల్లా వ్యవసాయ అధికారి


