వనపర్తి: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ ఖాన్, ఉమ్మడి జిల్లా ఆర్‌ఎల్‌సీ ఖాజా బహుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు htt ps://cet.cgg.gov.in/tmreir వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని, ఇందులో మహిళలకు 33 శాతం దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరి ంచారు. మరిన్ని వివరాలకు ఫోన్‌నంబర్ 040 23236112 సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: సీఎం ఓవర్‌సిస్ స్కాలర్‌షిప్ పథకం కింద విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు www.tela nganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్‌ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విద్యాలయాల్లో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ప్రవేశాలు పొందిన వారు అర్హులని, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు మించరాదని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన హార్డ్‌కాపీలు రెండు సెట్లను అటెస్టెడ్ చేసి జులై 31 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం లేదా సెల్‌నంబర్ 72078 54914, ఫోన్‌నంబర్ 08545 232500 సంప్రదించాలన్నారు.
మండలానికి
శిక్షణ ఐఏఎస్‌లు
గోపాల్‌పేట: శిక్షణ ఐఏఎస్‌లు సాయిశివాని, సచిన్ బసవరాజ్ రెవెన్యూశాఖ గురించి తెలుసుకునేందుకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మండలంలోని చాక్‌పల్లికి తీసుకెళ్లి సర్వేనంబర్లు, దిక్కులు చూపే రాళ్లు చూపించారు. శనివారం కార్యాలయంలో రైతుల ఖాతాలు ఎలా చూడాలి, రికార్డులు ఎన్ని రకాలు, ఎలా పరిశీలించాలనే విషయాలను తహసీల్దార్ వారికి వివరించారు. వారి వెంట రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు.


